చెర్రీతో దగ్గరుండి ఫొటో షూట్ చేయించిన ఉపాసన

  • వీడియోను షేర్ చేసిన ఉపాసన
  • సినిమా కోసం కాదు
  • ఫోర్స్ చేసి మరీ చెర్రీతో చేయించా
  రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెర్రీ సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు. తాజాగా చెర్రీకి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు.

ఆ వీడియోలో దగ్గరుండి చెర్రీతో ఉపాసన ఫొటో షూట్ చేయిస్తున్నారు. ఈ ఫొటో షూట్ సినిమా కోసం కాదని.. తమ కొత్త ఇంట్లోని గోడపై ఉంచటానికి ఫోర్స్ చేసి మరీ... చెర్రీతో చేయిస్తున్నానని ఉపాసన తెలిపారు. ఛాతిపై పెద్ద టాటూతో చెర్రీ ఈ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం చెర్రీ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి కానుకగా ఈనెల 11న విడుదల కానుంది.
 

Go Back to Shorts
Ramcharan
Upasana
Social Media
Vinaya Vidheya Rama
Sankranthi

More Telugu News